Sunday, May 19, 2024

రేవంత్ వర్సెస్ కెటిఆర్

- Advertisement -
- Advertisement -

టిపిసిసి అధ్యక్షులు, సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరికి ధీటుగా మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కనబడాలంటే.. చీర కట్టుకుని ఆర్‌టిసి బస్సు ఎక్కు.. అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. నిర్మల్ కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తున్నామని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.ఈ మేరకు ఎక్స్‌లో రాహుల్ గాంధీ ప్రసంగం వీడియోను పోస్టు చేశారు. “రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా..? ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ.2,500 చూపిస్తావా..? ఇన్ని పచ్చి అబద్ధాలా..? అని నిలదీశారు. తెలంగాణలో ఉన్న కోటీ 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారని పేర్కొన్నారు.

వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే అని వ్యాఖ్యానించారు. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని.. చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం అని పేర్కొన్నారు. కెటిఆర్ కిట్ ఆగింది…న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది…కల్యాణలక్ష్మి నిలిచింది…తులం బంగారం అడ్రస్ లేదు…ఫ్రీ బస్సు కూడా ఓ బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి అని విమర్శించారు. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని అన్నారు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు, నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ అందరికీ తెలిసిపోయిందని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News