Sunday, May 19, 2024

నన్ను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: డికె అరుణ

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలపై మహబూబ్‌నగర్ బిజెపి ఎంపి అభ్యర్థి డికె అరుణ ఎదురుదాడి చేశారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడల్లా తనని అవమానించేలా మాట్లాడుతున్నారని, సిఎం స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని సూచించారు. పార్లమెంటు ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను ఎక్కడా ప్రస్తావించటం లేదని, మళీ ఓట్ల కోసం కొత్త కొత్త మాటలతో మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని అరుణ దుయ్యబట్టారు. మహబూబ్ నగర్ నుంచి బిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అరుణ విరుచుకపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News