Monday, September 15, 2025

కేదార్ నాథ్‌లో హిమపాతం… యాత్ర నిలిపివేత

- Advertisement -
- Advertisement -

కేదారినాధ్: కేదారినాథ్‌లో భారీగా మంచు కురుస్తుండడంతో గురువారం మధ్యాహ్నం యాత్రను నిలిపివేశారు. సోన్ ప్రయాగ్‌లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు 4 వేల మంది పర్యాటకులను అనుమతించకుండా ఆపేశారు. వాతావరణం అనుకూలించిన తరువాత పంపిస్తామని అధికారులు చెప్పారు.

గడచిన 30 గంటల్లో దాదాపు 14 వేల మంది కేదారినాథ్‌కు వెళ్లగలిగారు. ఇందులో 50 శాతం మంది మధ్యాహ్నం వరకు కేదారిధామ్ వరకు చేరుకున్నారు. మరికొందరు గౌరీకుండ్, జంగల్‌చట్టి, భీంబబాలి,లించోలికి చేరుకున్నారు. అయితే గురువారం ఉదయం నుంచి కేదార్‌నాథ్‌లో వాతావరణ ం అకస్మాత్తుగా మారిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News