Tuesday, May 14, 2024

ఎపిలో ఆరాచక పాలన.. నా రాష్ట్రం.. నా ప్రభుత్వం.. నా ఇష్టం..

- Advertisement -
- Advertisement -

బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్

హైదరాబాద్ : నా రాష్ట్రం.. నా ప్రభుత్వం.. నా ఇష్టం.. అన్నట్లుగా ఎపిలో సిఎం జగన్ పాలన ఉందని బిజెపి పార్లమెంటరీబోర్డు సభ్యులు, ఎంపి డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థులు, ప్రజా సంఘాలు, ప్రజల పక్షాన ప్రశ్నించే మీడియాను అణిచివేసే విధంగా ఎపిలో పాలన సాగిస్తున్నారని అన్నారు. ఎపిలో అరాచక పాలనలో సామాన్యుడి పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. ఎపి సిఎం జగన్ నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వచ్చిన సందర్భంగా.. ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారని పదుల సంఖ్యలో పోలీసులు బిజెపి నేతలపై దాడి చేశారు.

కార్యకర్తలపై అమానుషంగా, అప్రజాస్వామికంగా లాఠీచార్జి చేసి కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తించారు. వైసిపి నేతలకు కూడా రాబోయే రోజుల్లో అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. జీవోల పేరుతో ప్రాధమిక హక్కులు కాలరాయాలని చూస్తున్న ఈ వైసిపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. అధ్వాన పాలనతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృధ్ధి, ఉపాధి కల్పన కోసం కేటాయించాల్సిన నిధులను కూడా ఉచితాలకు, ఇతరత్రా అవసరాలకు మళ్లించిన ఘనత జగన్ సర్కారుకు దక్కిందన్నారు. దాదాపు 5 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసి, జీతాలకే కటకట ఎపిలో ఏర్పడిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News