Sunday, May 5, 2024

జూన్ 4న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశం

- Advertisement -
- Advertisement -

జూన్ 4న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశం
ఈ ఏడాది సాధారణ వర్షాలే
భారత వాతావరణ శాఖ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగానికి ప్రాణం పోస్తూ దేశ ఆర్ధిక ప్రగతికి ప్రధాన ఆయువు పట్టుగా ఉన్న నైరుతి రుతుపనాలు ఈ ఏడాది జూన్ 4న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది దేశమంతటా సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ( ఐఎండి) వెల్లడించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతుంటాయి. అయితే ఈ ఏడాది మాంత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఐఎండి తెలిపింది. రుతుపవనాలు గత మూడేళ్ల నుంచి వరుసగా 2020లో జూన్ ఒకటిన కేరళలోకి ప్రవేశించగా, 2021జూన్ 3న ప్రవేశించాయి.

గత ఏడాది మాత్రం సాధారణ సమయం కంటే ఒకరోజు ముందుగానే మే 29న కేరళలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది మాత్రం సాధారణం కంటే నాలుగు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. హిందూ మహాసముద్ర ద్విధ్రువ, ఉత్తర అర్దగోళంలోని పరిస్థితుల కారణంగా ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సీజన్ ద్వితీయార్ధంలో ఈ ప్రభావం కనిపించవచ్చని వెల్లడించింది. గడిచిన 18ఏళ్లుగా భారతీయ వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల ప్రవేశంపై అంచనాలు వేస్తోంది.

2004నుంచి 2022వరకూ రుతుపవనాల రాకపై వాతవరణ శాఖ అంచనాల్లో ఒక్క 2015మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో ఐఎండి అంచానాలు తప్పలేదు. రుతుపవనాలపై అంచనాలకోసం భారత వాతావరణ శాఖ ప్రత్యేక నమూనాలను అభివృద్ది చేసింది. వాటి ప్రకారం రుతుపనాలను అంచనా వేయటంలో మరింత ఖచ్చతిత్వం పెరిగింది. మొత్తం ఆరు విధానాల్లో రుతుపనాల రాకను అంచనా వేస్తుంది. నైరుతి రుతుపవనాల వల్ల కురిసే వర్షాలే దేశ వ్యవసాయంగానికి అత్యంత కీలకంగా ఉంటున్నాయి. దేశంలోని పంటల సాగు విస్తీర్ణంలో 52శాతం పైగా వర్షాధారంగానే సాగులోకి వస్తున్నాయి. దేశ ప్రజలకు ఆహార భద్రతను కల్పిచంటంలో 40శాతం ఆహారధాన్యాల ఉత్పత్తి వర్షాధారం కింద పండే పటల వల్లే లభిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News