Tuesday, May 6, 2025

యుపి కోర్టులో కాల్పులు…

- Advertisement -
- Advertisement -

లక్నో: జౌన్‌పూర్ కోర్టు ఆవరణంలో ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మే6న సూర్య ప్రకాశ్, మితిలేశ్ గిరి అనే వ్యక్తులు రెజ్లర్ బదల్ యాదవ్‌ను హత్య చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా దివాణ కోర్టుకు సూర్య, మితిలేశ్ తరలిస్తుండగా కోర్టు ఆవరణంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వారిపై గన్‌తో కాల్చడంతో కుప్పకూలిపోయారు. వెంటనే దుండగులను లాయర్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని స్థానికంగా వారశాణిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: నల్లగొండ… నిప్పుల కొండ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News