Monday, April 29, 2024

నల్లగొండ… నిప్పుల కొండ

- Advertisement -
- Advertisement -

వేడెక్కిన తెలుగు రాష్ట్రాలు..19నుంచి సెగల పొగలు
సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికం
నిప్పుల కొండగా నల్లగొండ
వాతావరణ కేంద్రం హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు వెడెక్కిపోతున్నాయి. ఒక పక్క ఎండలు , మరో పక్క వేడిగాలులతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46డిగ్రీలకు చేరువయ్యాయి. ఈ నెల 19నుంచి ఎండలు మరింత భగ్గుమనే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నిప్పుల కొండగా మారింది.గత రెండు రోజులుగా ఈ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగింది.

మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట మునగాలలో 42.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా దామచర్లలో 45.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పక్కన ఆంధప్రదేశ్‌లో ఎండలు మరింత మండిపోతున్నాయి. రాజమండ్రిలో రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నెల్లూరు జిలా కొండాపురం, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 46.4డిగ్రీలను దాటేశాయి. రానున్న రోజుల్లో ఇవి 48డిగ్రీలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయన్న విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు మరింత కలవర పెడుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతూ వస్తోంది. ఇల్లు విడిచి బయటకు కదలాలంటేనే జనం జంకు తున్నారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు రావటం లేదు. వడదెబ్బ కారణంగా తెలంగాణలో ముగ్గరు, ఏపిలో ఇద్దరు మృతి చెందినట్టు సమాచారం.

ఈనెల 19నుంచి మంటలే!
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 19నుంచి పగటి ఉష్ణోగ్రతలు మరింతగా మంటలు పుట్టించనున్నట్టు వాతావరణకేంద్రం హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఇవి సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణలో ఉత్తర, ఈశాన్య, సెంట్రల్ జిల్లాల్లో సాధారణం కంటే మూడు డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ ప్రాంతంలో 41డిగ్రీలు పైనే ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఉత్తర, ఈశాన్య, సెంట్రల్ ,తూర్పు జిల్లాలకు అరెంజ్ వార్నింగ్ ప్రకటించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు నాలుగు రోజులు వడగాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఉష్ణొగ్రతలు పెరగనున్నాయి. మంగళవారం రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తంగులలో 44.9డిగ్రీలు, కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడులో 44.8, నల్లగొండ జిల్లా పజ్ణూరులో 44.7, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 44.5, నల్లగొండ జిల్లా మామిడాలలో 44.5, సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్‌లో 44.3, ఖమ్మం జిల్లా ఖనాపుర్‌లో 44.2, కొత్తగూడెం జిల్లా సీతారామపట్నంలో 44.2, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 44.2డిగ్రీలు నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News