Wednesday, May 15, 2024

మోడీని అనర్హునిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ తిరస్కృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హునిగా ప్రకటించాలంటూ దాఖలైన వినతిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్ లో ఇటీవల ఇచ్చిన ప్రసంగంలో దేవుడు, మందిరం పేరిట ఆయన ఓట్లు కోరి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై అనర్హత వేటేయాలని వినతిలో పేర్కొన్నారు.

అర్జీదారుడి విషయాన్ని ఎన్నికల సంఘం చూడాల్సి ఉండగా ఆయన కోర్టును ఆశ్రయించడం పూర్తిగా దురుద్దేశంతో కూడిందని కోర్టు అభిప్రాయపడింది. న్యాయమూర్తి సచిన్ దత్తా ఆయన వినతిని కొట్టివేశారు.

ఇటీవల రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ముస్లింలను ‘చొరబాటుదారులు’ అనడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘‘తల్లులు, సోదరీమణుల బంగారం లెక్కలేసి, సంపద సమాచారాన్ని సేకరించి, దానిని పున:పంపిణీ చేస్తానని కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొంది. వారు ఎవరికి పున:పంపిణీ చేస్తారు? ఇదివరలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశ సంపదపై ముస్లింలదే ప్రధాన హక్కు అని అన్నారు’’ అని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మీ కష్టార్జితం చొరబాటుదారులకు పోవాలా? దానిని మీరు ఆమోదిస్తారా?’ అని కూడా మోడీ ప్రసంగంలో ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు నోటీసులు జారీ చేసింది. స్టార్ ప్రచారకులు తమ ప్రసంగంలో సంయమనం పాటించాలని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News