Thursday, May 16, 2024

అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన అత్తాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. గోదాంలో నిల్వ ఉంచిన ఆయిల్ డబ్బాలు, సిలిండర్లు పేలిపోవడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ పార్కింగ్ చేసిన పాత వాహనాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరగడంతో సిలిండర్లు ఒక్కొక్కటి పేలాయి, దీంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు వెంటనే నాలుగు ఫైరింజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News