Saturday, May 4, 2024

సైబర్ క్రైం పిఎస్ ఎదుట క్యూనెట్ బాధితుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

స్వప్నలోక్ అగ్ని ప్రమాదం జరిగి రెండు నెలల అవుతున్నా న్యాయం చేయలేదని ఆవేదన
రూ.2లక్షలు కట్టించుకుని మోసం చేశారని ఆరోపణ

హైదరాబాద్: తమకు న్యాయం చేయాలని క్యూ నెట్ బాధితులు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఆరుగురు క్యూనెట్ ఉద్యోగులు మృతిచెందారు. అగ్నిప్రమాదం జరగడంతో క్యూ నెట్ భాగోతం బయటికి వచ్చింది. మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వహిస్తున్న క్యూ నెట్ నగరంలోని 300 మంది వద్ద నుంచి రూ.2లక్షల చొప్పున వసూలు చేసింది. భారీగా లాభాలు వస్తాయని నమ్మించి తమ వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.

క్యూనెట్‌కు సంబంధించిన రూ.137కోట్లను సీజ్ చేశామని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నా, తమకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం జరిగి రెండు నెలలు అవుతున్నా కూడా తమకు న్యాయం చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూ నెట్ బాధితులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News