Saturday, July 27, 2024

మారణహోమానికి ఎ1 జగన్, ఎ2 సిఎస్: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: పేదల ప్రాణాలతో సిఎం జగన్ రాజకీయం చేయాలనుకోవడం మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. పెన్షన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై సిఎస్‌కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గత నెలలో 35 మంది మృతి చెందగా ఇప్పుడు ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారన్నారు. తక్షణమే ప్రతి లబ్ధిదారుడికి ఇంటింటికి పింఛన్లు అందించాలని, లబ్ధిదారుల్ని వేధించి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మారణ హోమానికి ఎ1 జగన్ మోహన్ రెడ్డి అని, ఎ2 సిఎస్ అని ఆరోపణలు చేశారు. ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ప్రజలకు మేలు చేయకుండా రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తారా? అని బాబు ధ్వజమెత్తారు.

ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం చాలా దుర్మార్గమని, ఇసి ఉత్తర్వులను తుంగలో తొక్కి వృద్ధుల ప్రాణాలు తీస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల కూడా మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని, ఒక్క రోజులో పెన్షన్లు పంపిణీ పూర్తి చేసే వ్యవస్థ ఉందా? అని ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వృద్ధులను తీసుకోవాలని సచివాలయం ఉద్యోగాలు చెప్పడం కరెక్ట్ కాదు అని, ఇళ్లకు వెళ్లి చెప్పే బదులు ఆ సమయంలో పెన్షన్లు పంపిణీ చేయాలేరా? అని అడిగారు. అధికార పార్టీ నాయకుల కుట్రలో భాగమై వృద్ధులను తిప్పిస్తారా? అని బాబు దుయ్యబట్టారు. చాలాకాలంగా నిర్వహణ లేక లక్షలాది ఖాతాలు ఫ్రీజ్‌లో ఉన్నాయని, కెవైసి పేరుతో బ్యాంకు సిబ్బంది, ఆధార్, ఫాన్ తీసుకరమ్మంటున్నారని, మండుటెండలో లబ్ధిదారులు రోడ్లపై తిరగాల్సి వస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News