Saturday, May 18, 2024

ఫోటో ఐడి మరచిన యుకె మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్

- Advertisement -
- Advertisement -

లండన్ : యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) స్థానిక ఎన్నికలలో వోటు వేసేందుకు ఐడి తీసుకురావడం మరచిన బ్రిటిష్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఒక పోలింగ్ కేంద్రం నుంచి తిప్పిపంపివేశారు. తాను పదవిలో ఉండగా ఫోటోతో ఐడిని వోటర్లు చూపాలన్న నిబంధనను ప్రవేశపెట్టిన జాన్సన్ తన గుర్తింపును నిరూపించకుండా వోటు వేయజాలరని గురువారం దక్షిణ ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో పోలింగ్ కేంద్రం సిబ్బంది చెప్పారని బ్రిటిష్ మీడియా శుక్రవారం వెల్లడించింది.

2019 నుంచి 2022 వరకు కన్జర్వేటివ్ ప్రధానిగా వ్యవహరించిన జాన్సన్ ఆ తరువాత వోటు వేయగలిగారని, ఆయన కన్జర్వేటివ్ అభ్యర్థికి వోటు వేశారని ‘స్కై న్యూస్’ తెలియజేసింది. జాన్సన్ ఫోటో ఐడిని తప్పనిసరి చేస్తూ 2022లో ఎన్నికల చట్టం ప్రవేశపెట్టారు. కొత్త చట్టాన్ని నిరుడు స్థానిక ఎన్నికల్లో తొలిసారి అమలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News