Saturday, July 27, 2024

మహిళా స్వేచ్ఛలో డె‘న్మార్క్’

- Advertisement -
- Advertisement -

డెన్మార్క్‌లో గర్భస్రావ చట్టాలను మరింతగా సరళీకృతం చేశారు. ఈ దిశలో అబార్షన్ నియంత్రణ నిబంధనలను సడలించారు. దీనితో మహిళలు ఇకపై తమ 18 వారాల గర్భాన్ని కూడా తొలిగించుకునేందుకు వీలేర్పడింది. ఇంతవరకూ 12 వారాల అబార్షన్‌లకే చట్టబద్ధత ఉంటూ వచ్చింది. 50 ఏండ్ల తరువాత పలు స్థాయిల్లో అబార్షన్ నిబంధనలలో మార్పులు తీసుకువచ్చారు. 15 నుంచి 17 సంవత్సరాలలోపు బాలికలు ఇకపై తల్లిదండ్రుల సమ్మతిలేకుండానే అబార్షన్‌లకు వెళ్లేందుకు వీలు కల్పించే విధంగా చట్టాలకు సవరణలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలో ఇతర చోట్ల మహిళల హక్కులు లాక్కుంటున్న దశలో తమ దేశంలో వీటిని బలోపేతం చేస్తున్నామని

, ప్రత్యేకించి లింగసమానత్వం విషయంలో ముందుకు వెళ్లుతున్నామని దేశంలోని లింగ సమానత్వ న్యాయ వ్యవహారాల మంత్రి మేరీ జెర్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ ‘ మహిళకు తన శరీరం, తన జీవితం గురించి నిర్ణయించి అందుకు అనుగుణంగా వ్యవహరించే హక్కుంది. ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ సంబంధిత విషయం’ అని చెప్పారు. మహిళా స్వేచ్ఛకు సంబంధించి ఇది చారిత్రక రోజు అని పేర్కొన్నారు. కాలానికి అనుగుణంగా 50 ఏండ్ల తరువాత అబార్షన్ రూల్స్‌ను మార్చాల్సి వచ్చిందని దేశ ఆరోగ్య మంత్రి సోఫీ లోహ్డే స్పందించారు. డెన్మార్క్‌లో అబార్షన్లపై కట్టడి లేకుండా చేసే చట్టాన్ని 1973లో తీసుకువచ్చారు. ఈ చట్టంలో 12 వారాల గర్భం వరకూ విచ్ఛిత్తికి అవకాశం కల్పించారు. సర్జరీ సంబంధిత రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుని ఈ పరిమితి విధించారు. ఇప్పుడు కాలం మారింది.

కాలానుగుణంగా తలెత్తిన వైద్య శాస్త్ర ప్రక్రియ సౌలభ్యంతో గర్భవిచ్ఛిత్తి పరిమితి దశను 18 వారాలకు ఖరారు చేశారని డెన్మార్క్ ప్రభుత్వం సమర్థించింది. డెన్మార్క్‌లో 15 సంవత్సరాల బాలిక తన శరీరం తన స్వేచ్ఛ గురించి తనకు తానుగా నిర్ణయం తీసుకునే అనుమతి కల్పించారు. ఈ క్రమంలో అబార్షన్‌లకు 15 బాలిక కూడా తన సొంత నిర్ణయం తీసుకునేందుకు అధికారం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News