Saturday, July 27, 2024

వాట్సాప్ కొత్త పాలసీ రూల్స్ 

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: త్వరలో వాట్సాప్ కొత్త పాలసీ రానుంది. ఈ పాలసీలోని రూల్స్ బ్రేక్ చేసే వారు ఇకపై చాట్ చేయలేరు. మీ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది.  మెటా ఆధ్వర్యంలోని మెసెజింగ్ యాప్ వాట్సాప్ భద్రతకు తొలి నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ కంపెనీ కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో అనేక నియమ, నిబంధనలు ఉండనున్నాయి.

ఇటీవలే ‘వీ బీటా ఇన్ఫో(WeBetainfo) కొత్త ఫీచర్ గురించి ఓ నివేదికను ప్రచురించింది. అంటే మీరు వాట్సాప్ రూల్స్ బ్రేక్ చేస్తే.. కొంత సమయం వరకు చాటింగ్ చేయలేరు. వాట్సాప్ యాప్ ఓపెన్ అవుతుంది.. కానీ అది పని చేయదు. అందులోని ఆప్షన్లన్నీ తాత్కాలికంగా పని చేయవు.

వాట్సాప్ ఇప్పటికే మల్టీ ప్లాట్ ఫారమ్స్ లో మల్టీ ఆటోమెటెడ్ టూల్స్ ఇన్‌స్టాల్ చేసింది. స్పామ్, బల్క్ మెసేజీలు, ఇతర దుర్వినియోగాల విషయంలో యాప్‌ని చెక్ చేయడం వాట్సాప్ పని. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిఫ్షన్ కారణంగా ఈ ఆటోమేటిక్ టూల్స్ స్వతంత్రంగా పని చేస్తాయి. ఏదైనా దుర్వినియోగం లేదా స్పామింగ్ గుర్తించినట్లయితే, వెంటనే తాత్కాలికంగా బ్యాన్(నిషేధం) విధిస్తారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News