Tuesday, April 30, 2024

విఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేయడంపై ట్రెసా హర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పనిచేస్తున్న సుమారు 23వేల మంది విఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీని అమలు చేస్తున్నందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ శాఖలో విఆర్వో వ్యవస్థ రద్దు అయినందున పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ స్థాయిలో పరిపాలన సజావుగా సాగేందుకు విఆర్‌ఏలను రెవెన్యూ శాఖలో కొనసాగించాలని వారు కోరారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రులు కెటిఆర్, హరీష్ రావులకు ట్రెసా కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News