Wednesday, August 27, 2025

అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర పూజలు

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం అయ్యప స్వామి దేవాలయంలో శుక్రవారం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమచార్యుల ఆద్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 29న సోమవారం ఉదయం 9 గంటలకు ఉత్తర నక్షత్ర పూజలు నిర్వహించడం జరుగుతుందని గురుస్వామి తెలిపారు.

ఆలయ 30వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా దేవాలయంలో అష్టోత్తర శత కళషాభిషేనకం, పూర్ణాహుతి, పుష్పాభిషేకం, తదితర పూజలు నిర్వహించడం జరుగుతుందని గురుస్వామి వెల్లడించారు. అయ్యప్ప స్వాములు, భక్తులు ఉత్తర నక్షత్ర పూజలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయంలో ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News