Sunday, April 28, 2024

ట్యాంక్ బండ్‌పై బెల్లి లలిత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి…

- Advertisement -
- Advertisement -

మోత్కూరు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత విగ్రహాన్ని ప్రభుత్వం హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని యాదవ సంఘం జిల్లా నాయకులు జంగ శ్రీను, బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ కోరారు. తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత 24వ వర్థంతి సందర్భంగా శుక్రవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని చెరువు కట్ట చౌరస్తాలో యాదవ సంఘం, బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సమస్యలపై, ప్రత్యేక రాష్ట్రం కోసం తన పాటల ద్వారా ప్రజల గొంతుకైందన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా జవజీవాలు పోసిందని, తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి దగా పడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత పాత్ర ఎంతో కీలకమైందన్నారు. బెల్లి లలిత త్యాగాన్ని గుర్తించి ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టడంతో పాటు జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పురుగుల మల్లయ్య, కౌన్సిలర్ పురుగుల వెంకన్న, జంగ వెంకటనర్సయ్య, జంగ నాగరాజు, అవిశెట్టి నాగరాజు, చిర్రబోయిన కొమురయ్య, శ్రీరాంమురళీ, జంగ సతీష్, కన్నెబోయిన సతీష్, వడకాల యాదగిరి, పురుగుల లింగయ్యయ, నల్ల మధు, పురుగుల నాగరాజు, జంగ నరేష్, చిన్నపడిశాల మాజీ సర్పంచ్ దబ్బెటి నర్సయ్య, నాయకులు బయ్యని రాజు, లెంకల వేణు, మామిడాల యాకేష్, నల్ల కుమార్, బత్తిని ప్రభాకర్, కురిమిళ్ల రాములు, మొరిగాల సురేష్, హరీష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News