Sunday, May 11, 2025

సవాల్‌ను స్వీకరిస్తున్నాం : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ ప్రజలకు చేసిన మంచి ఏంటో దమ్ముంటే చెప్పాలని మంత్రి కెటిఆర్ విసిరిన సవాల్ ను బిజెపి స్వీకరిస్తోందని రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ ఎక్కడికి రమ్మంటారో… సమయం, తేదీ చెప్పాలని కోరారు. రాష్ట్రంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ఆ కొందరికే దక్కాయని ఆరోపించారు.

’సమగ్ర, సమతుల్య, సమ్మిళిత’ అభివృద్ధి పేరుమీద… కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ’ధరణి’ పోర్టల్ పేరుతో వేల ఎకరాల భూములను కొల్లగొట్టారు. బిఆర్‌ఎస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా…మూడోసారి అధికారంలోకి రారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే… బిజెపిపై, మోడీపై చిల్లరమల్లర ఆరోపణలు బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News