Sunday, May 5, 2024

కుటుంబ సభ్యులను కలిసేందుకు సిసోడియాకు అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భార్య, కుటుంబ సభ్యులను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

అదే సమయంలో పలు షరతులు విధించింది. భార్య, కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవద్దని ఆదేశించింది. మీడియాతో మాట్లాడకూడదని, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కూడా వాడకూడదని చెప్పింది. మరోవైపు, ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రేపు సాయంత్రం స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఇడికి ఆదేశించింది. బెయిల్ పిటిషన్ పై విచారణను జులై 4వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News