Saturday, May 4, 2024

మణిపూర్‌కు అక్రమ వలసలు ఆపాలని డిమాండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మయన్మార్ నుంచి మణిపూర్‌కు సాగుతున్న అక్రమ వలసలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మణిపూర్ పౌరసమాజం, విద్యార్థులు ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీకి చెందిన మణిపూర్ కోఆర్డినేటింగ్ కమిటీ, విద్యార్థుల సంఘాలు సంయుక్తంగా భారీ ఎత్తున ఈ ప్రదర్శన నిర్వహించాయి. మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చి ఉంటున్న ప్రజలంతా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కమిటీ సభ్యుడు చాన్ మెయితే మాట్లాడుతూ మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం , మణిపూర్ ప్రజలు విచ్ఛిన్నకర శక్తుల , బయటివారి దురాక్రమణలకు నిరసనగా ఈ ప్రదర్శన చేపట్టినట్టు చెప్పారు.

మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చే వలసదారుల కారణంగానే మణిపూర్‌లో అశాంతి, హింస ప్రజ్వరిల్లు తున్నాయని, వారు నల్లమందు సాగు చేపట్టడానికి అడవులను నరికివేస్తున్నారని మణిపూర్ తొయిబాల్ వైద్య విద్యార్థి జాయ్ ఆరోపించారు. అలాగే మయన్మార్ నుంచి వచ్చిన కుకి మిలిటెంట్లు సాగిస్తున్న హింసను ప్రభుత్వం అడ్డుకోవాలని కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడంలో మణిపూర్‌కు చెందిన వారంతా సమాన బాధ్యత వహించాలని , మణిపూర్ కుకీలు తమ బంధువులు, సోదరులని వారికి తాము వ్యతిరేకం కాదని ప్రెమ్ మెయితే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News