Friday, May 17, 2024

మరో ఉద్యమం చేద్దాం : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలారా.. ఉద్యమకారులారా.. కళాకారులారా.. మేధావులారా.. మళ్ళీ మనందరం మరొక ఉద్యమం చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. భువనగిరిలో జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘తెలంగాణ ఉద్యమకారుల అలయ్-బలయ్‘ కార్యక్రమానికి హాజరైన ఈటల రాజేందర్, బూర నర్సయ్యగౌడ్, తుల ఉమ, డాక్టర్ నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా తెలంగాణ గడ్డ ఉంది. తుఫాను తాకిడికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు. తెలంగాణ ఉద్యమానికి నేను ప్రత్యక్ష సాక్షిని. కులం, మతం, పార్టీలు, జెండాలతో సంబంధం లేకుండా అందరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. సకలజనులు ఉద్యమబాట పట్టారు.

పనులు పక్కన పెట్టీ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరికి ప్లాస్టిక్ కవర్లు ఏరుకునే వారు కూడా సంఘం ఏర్పాటు చేసుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక కెసిఆర్ యూ టర్న్ తీసుకున్నారు. పాట చాలా పదును అయ్యింది అని.. ఆ పాట ప్రజల పక్షాన ఉండవద్దు అని ఉద్యోగాల పేరిట పాటను కెసిఆర్ బంధి చేశారు. అయినా వేలాది మంది కళాకారులు పుట్టుకువస్తారు. ప్రజల పక్షాన నిలబడతారు. తెలంగాణ జాతి ఆకలి అయినా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పొదు. బహుజనుల రాజ్యం రావాలని.. ధర్మం, న్యాయం.. పేద ప్రజల సమస్యలకు పరిష్కారం కలిగే పాలన కావాలని కోరాము. కానీ ఆ పాలన రాలేదు. అది తెచ్చుకుందాం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News