Saturday, August 16, 2025

వారాహి యాత్రకు అనుమతి ఉంది: కాకినాడ ఎస్‌పి

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అనుమతి ఉందని కాకినాడ ఎస్‌పి సతీష్ కుమార్ తెలిపారు. పవన్ యాత్రపై పార్టీ నేతలు అనుమతి కోరారని, పవన్ పాల్గొనే బహిరంగా సభలకు అనుమతి ఇచ్చామన్నారు. పవన్ కల్యాణ్ జూన్ 14న వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. అన్నవరం రత్నగిరిపై కొలువై ఉన్న సత్యదేవుని దర్శనం చేసుకున్న అనంతరం వారాహి యాత్ర ఉంటుంది. అదే రోజు ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో సభలో జనసేనాని మాట్లాడుతారు.

Also Read: లగ్జరీ కారులో వచ్చి మేకను ఎత్తుకెళ్లారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News