Wednesday, July 9, 2025

భూపాలపల్లిలో పత్తి రైతులను మోసం చేసిన వ్యాపారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులను మోసం చేసి పత్తి వ్యాపారి పరారైన సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వ్యాపారిని చిట్యాల మండలం జూకల్ చెందిన సురాబు శంకర్రావుగా గుర్తించారు. మొగుళ్లపల్లి, రేగొండ మండలాల రైతులను శంకర్రావు మోసం చేశాడు. రూ.3 కోట్ల వరకు మోసం చేశాడని పత్తి రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారి సురాబు శంకర్రావు ఇంటి వద్ద పత్తి రైతులు ఆందోళనకు దిగారు. శంకర్రావును అరెస్ట్ చేసి డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News