Tuesday, July 15, 2025

ఆమనగల్లు 15వ వార్డులో కంటి వెలుగు శిబిరం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు: ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోని దృష్టిలోపాలను దూరం చేసుకోవాలని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్‌నాయక్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని 15వ వార్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం స్థానిక కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్‌తో కలిసి చైర్మన్ ప్రారంభించారు. శిబిరంలో వార్డు ప్రజలతోపాటు విద్యార్థులు, సిబ్బంది కూడ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. చుట్టపక్కల వారికి శిబిరం గురించి తెలపాలని ఈ సందర్భంగా కౌన్సిలర్ లక్ష్మణ్‌కు చైర్మన్ రాంపాల్‌నాయక్ సూచించారు. కా ర్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి, వైద్యులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News