Sunday, August 31, 2025

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మనదపురం : కరెంట్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కర్వెన తండాలో చోటు చేసుకుంది. ఎస్సై మురళి కథనం ప్రకారం కర్వేనా తాండకు చెందిన కేతావత్ భాస్కర్ నాయక్(40) సోమవారం ఉదయం ఎప్పటిలాగే తన తమ్ముడు రవి నాయక్‌తో కలిసి వ్యవసాయ పొలంలోని బహిర్భూమికి వెళ్లగా అక్కడ రాత్రి కురిసిన గాలి వానకు మోటారు వైరు తెగిపడి ఉండడంతో గమనించిన భాస్క్‌ర్ నాయక్ వైరును చేతులతో చుడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య చిన్న లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News