Tuesday, May 21, 2024

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి

- Advertisement -
- Advertisement -
వైస్ చైర్మన్‌గా ఎస్‌కె మహమూద్ నియామకం
మూడేళ్ల పాటు పదవిలో కొనసాగింపు

హైదరాబాద్ : తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. సోమవారం ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యామండలి ఇంచార్జిగా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మరో వైపు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్‌ను నియమితులైయ్యారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News