Thursday, May 9, 2024

16వ ప్రణాళిక సంఘం చైర్మన్‌గా పనగరియా

- Advertisement -
- Advertisement -

త్వరలో మరికొంత మంది సభ్యుల పేర్ల ప్రకటన

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 16వ ప్రణాళికా సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగరియాను నియమించింది. పనగారియా గతంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సేవలందించారు. ఇక ఆర్థిక మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనమ్‌ను సంఘం కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కమిషన్‌లోని ఇతర సభ్యుల పేర్లను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ గత నెలలో 16వ ప్రణాళికా సంఘం నిబంధనలకు ఆమోదం తెలిపింది.

ఈ సంఘం ఐదేళ్ల కాలానికి (2023-27 నుంచి 2030-31) గాను నివేదికను రూపొందిస్తుంది. ఈ నివేదికను 2025 అక్టోబర్ నాటికి రాష్ట్రపతికి సమర్పిస్తుంది. కమిషన్ సభ్యుల పదవీకాలం 2025 అక్టోబర్ 31 వరకు, అంటే నివేదిక సమర్పించే తేదీ వరకు ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, రెవెన్యూ గ్రాంట్లతో పాటు 16వ ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ చర్యలపై తన సిఫారసులను చేస్తుంది. అంతేకాకుండా విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం, నిధుల పంపిణీపై కూడా నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై ఆర్థిక సంఘం సూచనలు చేస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News