Monday, May 20, 2024

దేశం లోనే తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి

- Advertisement -
- Advertisement -

దేశం లోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ జూన్ 4 నుంచి కేరళ లోని తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనున్నది. ఎస్‌ఆర్‌ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీస్‌ను నిర్వహించనున్నది. ఈ రైలు ప్రధాన లక్షం పర్యాటకులను ఆకర్షించడం. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతోఈ ప్రైవేట్ రైలు సర్వీస్‌ను నిర్వహించనున్నారు. తిరువనంతపురం నుంచి గోవామార్గంలో త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్ ,

కాసర్‌గోడ్ సహా పలు స్టేషన్లలో రైలును ఆపుతారు. ఇందులో ఏకకాలం 750 మంది ప్రయాణం చేయవచ్చు. 2 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 థర్డ్‌క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వైద్య నిపుణులు సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైపై సదుపాయం, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. స్టార్ హోటల్ వసతి భోజన సదుపాయంతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే టూర్ ప్యాకేజీలను కూడా అందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News