Wednesday, May 29, 2024

మాకు తొలి ప్రాధాన్యత దేశం… కాంగ్రెస్, బిఆర్ఎస్ కు కుటుంబం: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించిందని, కాంగ్రెస్ పార్టీ ఓటమి కరీంనగర్‌లో ఖాయమైందని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభావం కరీంనగర్‌లో మచ్చుకైనా కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. దక్షిణ కాశీ భగవానుడు రాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు తెలిపారు.

మీ ఓటుతోనే ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, పదేళ్ల ఎన్‌డిఎ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చామని, వ్యవసాయ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించామని, టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేశామని తెలియజేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నామన్నారు. బిజెపికి దేశమే తొలి ప్రాధాన్యత అయితే కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు కుటుంబమే తొలి ప్రాధాన్యత అని మోడీ విమర్శలు గుప్పించారు.

కుటుంబం వల్ల కుటుంబం చేత కుటుంబం కోసం నినాదంతో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు పని చేస్తున్నాయని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ ఒకటేనని, నాణేనికి బొమ్మ బొరుసు వంటివని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయని, మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవం తప్పదని మోడీ జోస్యం చెప్పారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ బిజెపి, ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News