Monday, May 20, 2024

క్రిశాంక్ చేసింది తప్పని నిరూపిస్తే నేను జైలుకు వెళ్తా:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై తప్పుడు కేసు పెట్టారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన అధికారిక లేఖను మార్ఫింగ్ చేశారన్న కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ఆయన సతీమణి సుహాసిని, న్యాయవాదులతో కలిసి బుధవారం కెటిఆర్ పరామర్శించారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి క్రిశాంక్‌ను అరెస్టు చేశారని విమర్శించారు. క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. క్రిశాంక్ చేసింది తప్పని నిరూపిస్తే తాను జైలుకు వెళ్తానని అన్నారు.నిరూపణ కాకుంటే సిఎం రేవంత్ జైలుకు వెళ్తారా…? అని ప్రశ్నించారు. సిఎం రేవంత్‌కు దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్,

తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టాలని సవాల్ చేశారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని, ఇలా నిర్దోషులను కాదంటూ మండిపడ్డారు. క్రిశాంక్ జైలులో నిబ్బరంగా ఉన్నారని, త్వరలోనే విడుదలవుతారని కెటిఆర్ తెలిపారు. క్రిశాంక్‌ను ఉద్దేశపూర్వకంగానే జైలులో పెట్టారని ఆరోపించారు.ఇకపైనా సిఎం రేవంత్‌రెడ్డి సిగ్గు తెచ్చుకుని చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అన్నారు. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పాలని, ఏ తప్పు చేయని క్రిశాంక్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News