Saturday, July 27, 2024

ఆఖరి విడతల్లో మహాలక్ష్మి అస్త్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఆరవ, ఏడవ విడత పోలింగ్‌కు ముందు మహిళలను విస్తృతంగా ఆకర్షించడంపై కాంగ్రెస్ మ రింతగా దృష్టి కేంద్రీకరించింది. తమ ప్రతిపాదిత ‘మహాలక్ష్మి’ పథకానికి విస్తృత ప్రచారం లక్షంగా పార్టీ 40 లక్షల పైచిలు కు కరపత్రాలు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు, ఆ పథకం కింద పేద కుటుంబం నుంచి ఒక మహిళకు ఏటా లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘తీవ్ర సం క్షో భం’నేపథ్యంలో దేశంలోని మహిళలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారి కోసం పార్టీ ప్రతిపాదిత ‘మహాలక్ష్మి ప థకం’ వారి జీవితాల మెరుగుదలకు దోహదం చేస్తుందని కాం గ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ క్రితం వారం ఒక వీడి యో సందేశంలో సూచించారు. ‘పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి ఏడాది మేము లక్ష రూపాయలు ఇవ్వగలమని కాం గ్రెస్ ‘మహాలక్ష్మి’ పథకం గ్యారంటీ ఇస్తోంది’ అని ఆమె తన వీడి యో సందేశంలో తెలిపారు. ఆరవ, ఏడవ దశలకు మందు దేశవ్యాప్తంగాపోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో ‘మహాలక్ష్మి’ పథకంపై ప్రధాన దృష్టితో కాంగ్రెస్ 40 లక్షలకు పైగా కరపత్రా లు పంపిణీ చేయనున్నదని ఆ వర్గాలు తెలియజేశాయి.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఢిల్లీలో ఒక ర్యాలీ లో ప్రసంగిస్తూ, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. జూలై 1న పేద మహిళలు తమ ఖాతాలను సరి చూసుకున్నప్పుడు ‘మ్యాజిక్’గా రూ. 8500డిపాజిట్ అయినట్లు కనుగొంటారని రాహుల్ ఇంతకుముందు ఒక బహిరంగ సభలో చె ప్పారు. ప్రతి నెల మొదటి తేదీన ఇది జరుగుతుందని ఆయన తె లిపారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర స మయాల్లో పలువురు మహిళలు రాహుల్ గాంధీని కలుసుకుని తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారని, ఆ తరువాత మ హాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రతిపాదించిందని పార్టీ వర్గాలు వివరించాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఐదు ప్రధాన గ్యారంటీల్లో మహాలక్ష్మి ఒకటి. ‘బేషరతు నగదు బదలీగా ప్రతి పేద భారతీయ కుటుంబానికి ఏటా లక్ష రూపాయలు ఇచ్చేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ తీర్మానించింది. స్వల్ప ఆదాయ కుటుంబాలలోని పేదలను గుర్తిస్తారు’ అని కాంగ్రెస్ మేనిఫెస్టో తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆరవ విడత పోలింగ్ ఈ నెల 25న, ఏడవ, ఆఖరి విడతపోలింగ్ జూన్ 1న జరగనున్నాయి. వోట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News