Tuesday, May 21, 2024

ప్రధాని మోడీ కుర్చీ కంపిస్తోంది: మల్లికార్జున్ ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మూడు దశల లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కుర్చీ కంపిస్తోందని, ఆయన తన సొంత మిత్రులైన అదానీ, అంబానీలపైనే దాడి చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. దీన్ని బట్టే ఎన్నికల ఫలితాల నిజమైన సరళి తెఉస్తోందని ఖర్గే వ్యాఖ్యానించారు. కాలం మారుతోంది. మిత్రులు ఇక మిత్రులు కారు. మూడు దశల ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నేడు తన సొంత మిత్రులపైనే దాడి చేయడం ప్రారంభించారు. మోడీ కుర్చీ కంపిస్తోందని స్పష్టంగా కనపడుతోంది.

ఇదే ఎన్నికల ఫలితాల నిజమైన సరళి అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఖర్గే వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్లుగా కాంగ్రెస్ యువరాజు పదే పదే ప్రస్తావిస్తున్న అంబానీ, అదానీ పేర్లను కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు ఆపేసిందో వివరించాలని తెలంగాణలో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ డిమాండ్ చేశారు. ఆ ఇద్దరితో కాంగ్రెస్ ఏదో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News