మన తెలంగాణ/హైద్రాబాద్ : కారంపొడి ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆది వారం ట్వీట్ చేశారు. సంవత్సరానికి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంనద్నారు. రెండు మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్రంగా మహబూబాబాద్ తయారైందని వెల్లడించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటను పరిశీలిస్తే, ఒక్క మహబూబాబాద్ జిల్లా నుంచే 25 శాతం ఉత్పత్తి అవుతుందన్నారు.
మహబూబాబాద్ నుంచి ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన మిర్చికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్సాటు తర్వాత అన్ని రంగాల్లో అద్భు తమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మిరప రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని, ఇవి రైతులకు ఎంతో ఉపయుక్తకరంగా ఉన్నాయన్నారు. కురవ మండలంలో రూ.70 కోట్లతో ప్లాంట్ లిపిడ్స్ పేరిట, మరిపెడ మండలంలో విద్యా హెర్బ్ రూ.50 కోట్లతో చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పిందన్నారు. ఈ రెండు యూనిట్లు రోజుకు 150 మెట్రిక్ టన్ను ల మిర్చిని ప్రాసెస్ చేస్తున్నాయన్నారు. ఈ రెండు కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలి పారు. ఈ యూని ట్ల ఏర్పాటుతో రైతులకు 10 నుంచి 20 శాతం వరకు ఆదాయం పెరిగిందన్నారు. ఇప్పటివరకు ప్లాంట్ లిపిడ్స్ రూ.100 కోట్ల విలువైన సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల మిర్చిని సేకరించిందని వెల్లడించారు.
Sharing a success story of industrialisation in rural Telangana
✳️ Mahbubabad in one of the highest chilli producing districts in Telangana with an annual production of approx. 1.5 lakh MTs (approx. 25% of the total Telangana's production). Further, the quality of the chilli… pic.twitter.com/Hsvwph0IPR
— KTR (@KTRBRS) July 2, 2023