Wednesday, May 8, 2024

మణిపూర్‌పై ప్రధాని ప్రకటన అత్యవసరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు గురువారం డిమాండ్ చేశాయి. కొత్తగా ఏర్పాటు అయిన ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ఆవరణలోని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశం అయ్యారు. వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్ష ఉమ్మడి కూటమి తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండియా భేటీ జరిగింది. మణిపూర్‌లో పరిస్థితి దిగజారుతోందని, దీనిపై వెంటనే ప్రధాని స్పందించాల్సి ఉందని, పార్లమెంట్ ద్వారా ఈ అంశంపై జాతికి వివరణ ఇవ్వాల్సి ఉందని ఖర్గే తెలిపారు.

ముందుగా మణిపూర్ సిఎం ఎన్ బీరెన్ సింగ్‌ను బర్తరఫ్ చేయాలి. శాంతిస్థాపనకు అక్కడ రాష్ట్రపాతి పాలన విధించాలని సూచించారు. మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో జరుగుతున్న భయానక, దారుణ ఘటనలు ఆందోళనకరమని, పార్లమెంట్‌లో ప్రధాని ప్రకటన అవసరం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పష్టం చేశారు. మహిళలను వీధులలో నగ్నంగా ఊరేగిస్తున్నారు. వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. హింసాకాండ పెరుగుతోంది. ఇప్పటికీ ప్రధాని మౌనం వహించడం దారుణమని ఖర్గే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News