Monday, April 29, 2024

గెస్ట్ లెక్చరర్లను ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయం : ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న 1654 మంది అతిథి అధ్యాపకులను తొలగించడం అన్యాయమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పాత వారి స్థానంలో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి నూతన నియమకాలు చేయాలనే ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యథావిధిగా పాతవారిని రెన్యూవల్ చేసి కొనసాగించాలని కోరారు. గెస్ట్ లెక్చరర్స్ ప్రభుత్వం పెట్టిన మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూలు ద్వారా త్రిమెన్ సెలక్షన్ కమిటి ద్వారా ఎంపికై గత 15 ఏళ్లుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం అనేక సంవత్సరాలు నుండి ఇంటర్ విద్యలో పోస్టులు భర్తీ చేయకపోయినా పర్మినెంట్ అధ్యాపకుల మాదిరిగా పనిచేస్తూ ప్రభుత్వ కళాశాలలో విద్యబోధన చేస్తారన్నారు. ప్రభుత్వం కూడా ఈ మధ్యనే ప్రస్తుతం తాత్కాలికంగా పని చేస్తున్న వారిని తొలగించవద్దని జీ.వో.నెంబర్ 1145 ద్వారా ఆదేశాలు ఉన్న ఇంటర్ బోర్డు ఏకపక్షంగా ఈ నిర్ణయం చేయడం సరికాదన్నారు. తక్షణమే రాష్ట్రంలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు ను తిరిగి కోనసాగించాలని డిమాండ్ చేశారు. కనీసం ఉద్యోగ భద్రత లేకపోయినా ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం వీరి సేవలను ఉపయోగించుకుందని తక్షణం విద్యార్ధులు నష్టపోకుండా వారిని తీసుకోవాలని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News