Friday, November 1, 2024

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ కావాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వా రా వైద్య సేవలు పేద ప్రజలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ ఆర్ .వి.కర్ణన్ అన్నారు.వైద్య శాఖ డాక్టర్ లు,ప్రోగ్రాం అధికారులు సమర్థవంతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆ రోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ లతో వైద్య ఆరోగ్య శాఖ పని తీరు పై సమీక్షించారు.సబ్ సెంటర్ భావనాల నిర్మాణంవేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో 257 సబ్ సెంటర్లు ఉన్నాయని,52 ప్రభుత్వ భవనాలలో,205 ప్రైవేట్ భవనాలలో పని చేస్తున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి వివరించారు.164 సబ్ సెంటర్ భవనాలు నిర్మాణంకు మంజూరు చేయగా 24 తెలంగాణ వైద్య మౌ లిక సదుపాయాల సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టగా 7 పూర్తి అయినట్లు వైద్య అధికారులు వివరించారు.మిగతా సబ్ సెంటర్ భవనాల నిర్మాణం పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టి నట్లు, పనులు ప్రగతిలో నున్నట్లు అధికారులు వివరించారు.సబ్ సెంటర్ భవనాల నిర్మాణంలను మానిటర్ చేయుటకు నోడల్ అధికారి ని నియమించాలని డి.యం.హెచ్. ఓ ను ఆదేశించారు.

ఏరియా ఆసుప త్రిల్లో సీమాంక్ సెంటర్ లలో ఖాళీగా ఉన్న గైన కాలజిస్ట్ లను వారం రోజుల్లో నియమించాలని,డెలివరీ లను పెంచాలని అన్నారు. ఆశా, ఏ.ఎన్.ఎం.లు అంగన్ వాడి సెంటర్ లలో పోషకాహారలోపం తో ఉన్న పిల్లలను పరీక్షించి అవసరమైన వారిని సి.డి.పి.ఓ సమన్వ యంతో సబ్ సెంటర్ లలో పరిశీలించి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి పోషకాహార పునరావాస కేంద్రం(న్యూట్రిషన్ రెహబిలిటేషన్ సెంటర్)కు పంపించాలని అన్నారు.వైద్య ఆరోగ్య శాఖ ,మహిళా శి శు సంక్షేమ శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని అన్నారు. రెగ్యులర్ సమావేశాలు నిర్వహించి సమీక్షించాలని అన్నారు..

ప్రతి రోజు ఎంత మంది చూస్తున్నారు నివేదిక అందించాలని ఆదేశించారు.జిల్లా కేంద్ర ఆసుపత్రి లోహియరింగ్ ,డెంటల్ , ఆప్తామలిక్ ల పని తీరు తెలుసుకున్నారు.జిల్లా కేంద్ర ఆసుపత్రి లో ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్ లోసైకాలజిస్ట్ ఖాళీని భర్తీ చేయాలని సూచించారు.108,102 అంబులెన్స్ ల పని తీరు,ఎక్కడ పని చేస్తున్నాయి తెలుసుకున్నారు.పి.హెచ్.సి లకు ప్రతి శుక్రవారం ఏ.ఎన్.సి(ఆంటీ నాటల్) చెకప్ కు వచ్చే గర్భిణీ లకు అంగన్ వాడి సెంటర్ ల నుండి సి.డి.పి. ఓ లు, ఏ .ఎన్ ఎం లు ఆహారం అందించాలని ఆదేశించా రు.గర్భస్త, భ్రూణ హత్యలు జరగకుండా వైద్య అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రులను మానిటర్ చేయాలని సూచించారు. తెలంగాణ డయాగ్నిస్టిక్ హబ్ లో 134 పరీక్షలు చేస్తున్నట్లు, కలెక్షన్ సెంటర్‌ల నుండి శాంపిల్స్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ డ యాగ్న స్టిక్ టి.హబ్ కుటెస్ట్ లకు రిఫర్ చేయాలని అన్నారు. ఎన్.సి.డి.క్లినిక్ లలో డాక్టర్లను ఏర్పాటు చేయాలని అన్నారు.

ఆశా వర్కర్లు అంగన్ వాడి కేంద్రంలను గర్భిణీ లు,పిల్లలు, దీవ్యాంగులు,వయో వృద్దులు పరిశీలనకు ఉపయోగించుకోవాలని,ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని వైద్య శాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రుల లో డెలివరీ లు,సి.సెక్షన్ కేసులుకె.సిఆర్‌కిట్ లు పంపిణీ సమీక్షించారు.జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే డెలివరీ లలో 58 శాతం సాధారణ డెలివరీ లు జరుగుతున్నట్లు,42 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డెంగ్యూ ,క్షయ వ్యాధి కేసులు సమీక్షించారు.జిల్లాలో 15 డెంగ్యూ కేసులు ఉన్నాయని వైద్య అధికారులు తెలిపారు.

డయాగ్న స్టిక్ కేంద్రాల్లో రాపిడ్ టెస్ట్ లు చేసి డెంగ్యూ నెగటివ్ వచ్చిన వెంటనే ప్రకటించ వద్దని,జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కి శాంపిల్ పంపి టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ప్రకటించాలని అన్నా రు.జిల్లా ఆసుపత్రి లో హెచ్. ఐ.వి నిర్థారణకు ఎలిసా టెస్ట్ ల నిర్వహించాలని అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.కొండల్ రావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లచ్చు నాయక్,డిప్యూటీ డి.యం.హెచ్.ఓ డా.వేణు గోపాల్ రెడ్డి,డి.సి .హెచ్.ఎస్. డా.మాతృ ,మహిళా,శిశు,సంక్షేమ, దీవ్యాం గుల,వయో వృద్ధుల శాఖ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News