Sunday, May 12, 2024

ఈషా, నర్వాల్ జోడీకి స్వర్ణం

- Advertisement -
- Advertisement -

బాకు (అజర్‌బైజాన్): అజర్‌బైజాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి స్వర్ణం గెలుచుకుంది. శుక్రవారం రెండో రోజు భారత్‌కు చెందిన ఈషా సింగ్, శివ నర్వాల్ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో పసిడి పతకం సాధించింది. తెలంగాణకు చెందిన యువ షూటర్ ఈషా సింగ్ అసాధారణ ఆటతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది. ఫైనల్లో ఇషానర్వాల్ జోడీ 1610 పాయింట్ల తేడాతో టర్కీకి చెందిన ఇలయిదా తర్హాన్‌యూసుఫ్ డికెక్ జంటను ఓడించింది.

ఆరంభం నుంచే భారత షూటర్లు పూర్తిగా ఏకాగ్రతను కనబరిచారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. ఇంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత బృందం కాంస్య పతకం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌తో సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన అగ్రశ్రేణి షూటర్లు పోటీ పడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News