Sunday, May 12, 2024

వసతి గృహాల్లో పనిచేస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

- Advertisement -
- Advertisement -

వేతనాలు పెంచి నెలకు రూ. 25 వేలు ఇవ్వాలి : బిసి సంక్షేమ సంఘం డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ వసతి గృహాల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేసి, కళాశాల హాస్టల్ వర్కర్లను అవుట్ సోర్సింగ్ నుండి తీసి కాంట్రాక్టు పద్దతిలో కొనసాగించాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసిసంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం బిసి కాలేజీ హాస్టల్ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని బిసి కమిషనర్ కార్యాలయం వద్ద హాస్టల్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసి,ఎస్సీ, ఎస్టీ కళాశాల వసతి గృహాల కార్మికులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

వర్కర్ల జీతాలు నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచాలని గ్రామాలలో లేబర్‌కు రోజుకు రూ. 600 చొప్పున నెలకు రూ. 18 వేలు సంపాదిస్తున్నట్లు, అదే విధంగా హైదరాబాద్‌లో అడ్డ కూలీలు నెలకు రూ. 24 వేలు వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. అంతకంటే తక్కువ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని పెరిగిన ధరల ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకొని వెంటనే జీతాలు రూ. 25 వేలకు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో వర్కర్ల సంఖ్యను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెంచాలని ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి 100 మంది విద్యార్థులకు ముగ్గురు వర్కర్లు ఉండాలన్నారు. 250 మంది విద్యార్థులు ఉన్న హాస్టళ్ళ ముగ్గురు వర్కర్లు ఉన్నారని దీనితో వర్కర్లకు పని భారం పెరిగిందన్నారు. విద్యార్థులకు కాలేజీ టైo లోపు భోజనం తయారుచేయడంలో ఇబ్బందులు ఎదురైతున్నాయి హాస్టల్‌లో ముగ్గురు వర్కర్లను అధనoగా మంజూరు చేయాలని కోరారు.

హాస్టల్ వర్కర్లు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు,  సుమారు 14 గంటలు పనిచేస్తున్నట్లు ఇతర ప్రభుత్వ ఆఫీసులలో ఏడు గంటలు మాత్రమే పని చేస్తున్నట్లు తెలిపారు. అదనపు పనికి ఓటి ఇతర అలవెన్సు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వర్కర్ల జీతాలను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఇస్తున్నారని ఏజెన్సీలు నెల,నెలా సక్రమంగా ఇవ్వకుండా కోత పెడుతున్నారని జీతాలను ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల ఖాతాలలో వేయాలన్నారు. ఈ మధ్య కాలంలో సకాలంలో జీతాలు రాకపోవడంతో, అలాగే జీతాలు తక్కువగా ఉండడంతో చాల మంది రాజీనామా చేసి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం ప్రభుత్వ పాలసీని మార్చాలని, వార్డెన్ల మాదిరిగా హాస్టళ్లకు శాశ్వత వర్కర్లను నియమించి ప్రతి హాస్టల్‌కు నలుగురు శాశ్వత వర్కర్లను నియమించాలన్నారు. సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పుచెప్పింది దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి. ప్రతి వర్కర్‌కు ఐడెంటి కార్డు, డ్రెస్ కోట్ పెట్టి డ్రెస్ అందించాలని, కార్మిక చట్ట ప్రకారం సెలవులు ఇచ్చి ప్రభుత్వం ఉచిత బస్ పాస్‌లు మంజూరు చేయాలని కోరారు.

hostel workers

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News