Wednesday, May 22, 2024

మోడీకి ‘మదర్సడే’ బహుమతులు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ తన తల్లి దివంగత హీరాబెన్ పటేల్‌తోఉన్న రెండు చిత్తరువులను అభిమానులు మోడీకి అందజేశారు. ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్ లోని హుగ్లీలో ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఫోటోలను అభిమానులు ప్రదర్శించడంతో మోడీ ఉద్వేగానికి గురయ్యారు.

పశ్చిమ దేశాల్లో ప్రజలు ఈరోజును మాతృదినోత్సవంగా జరుపుకొంటారు. మనం మాత్రం ఇక్కడ మనతల్లిని, దుర్గామాత , కాళీమాత, భరత మాతలను 365 రోజులూ ఆరాధిస్తాం అని మోడీ ఈ సందర్భంగా మాతృదినోత్సవ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News