Tuesday, May 21, 2024

‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

రాజ్‌కుమార్ రావ్, హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్ వస్తున్న చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీని సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ నిర్మించారు. ఆదివారం మధ్యాహ్నం స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ఈ మూవీలో రాజ్‌కుమార్ మహేంద్ర సింగ్ ధోని పాత్రను పోషిస్తుండగా, జాన్వి మహిమ అనే పాత్రలో నటిస్తుంది. ట్రైలర్ ను బట్టి చూస్తే.. క్రికెటర్ అవ్వలేకపోయిన హీరో.. తన భార్యను నేషనల్ క్రికెట్ ప్లేయర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈక్రమంలో చోటుచేసుకునే ఓమోషనల్ జర్నీలో తన భార్యను నేషనల్ ప్లేయర్ గా తయారు చేసినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. కాగా, ఈ మూవీ క్రికెటర్ గా కనిపించేందుకు ఆరు నెలల ఇంటెన్సివ్ శిక్షణ పొందినట్లు జాన్వీ వెల్లడించింది. కాగా, ఈ చిత్రాన్ని మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News