Sunday, May 19, 2024

మెదక్ జిల్లాలో దారుణం

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బెట్టింగ్‌లకు అలవాటు పడిన కుమారుడిని తండ్రి కొట్టి చంపాడు.ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్‌కుమార్ రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తు న్నాడు. అతను సరదాగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇలా రూ.2 కోట్ల వరకు డబ్బులు పొగొట్టుకున్నాడు. ఇది గమనించిన తండ్రి సత్యనారాయణ వాటిని మానుకోవాలని ముకేశ్‌కుమార్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతను తన పద్ధతిని మార్చుకోలేదు. ఈ క్రమంలోనే విసిగివేసారని సత్యనారాయణ శనివారం అర్ధరాత్రి కుమారుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు.

దీంతో తీవ్రగాయయాలతో ముకేశ్ కుమార్ మృతి చెందాడు. మృతుడు చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారమే తండ్రీ కుమారుల మధ్య గొడవకు కారణమైందని, ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ముకేశ్‌కుమార్ మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్ కారణం గా అమ్మేశారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News