Thursday, May 23, 2024

ఆర్టీసి ప్రత్యేక బస్సుల్లో 1.25 శాతం ఛార్జీలు పెరుగుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికుల కోసం ఆర్టీసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సుల్లో 1.25 శాతం ఛార్జీలు పెంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఒకసైడ్ ట్రాఫిక్ అధికంగా ఉండటంతో తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తున్నాయన్న కారణంగా ఈ ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. సాధారణంగా రూ. 220లు ఉన్న టికెట్ ధర తాజా పెరుగుదలతో స్పెషల్ బస్సుల్లో రూ. 250 తీసుకుంటున్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. అలాగే పెంచిన టికెట్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ప్రయాణికులు అప్‌లోడ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News