Tuesday, May 21, 2024

విశాఖలో నోట్ల కట్టల కలకలం.. కారు వదిలేసి ఉడాయించిన నిందితులు

- Advertisement -
- Advertisement -

ఎపిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో పలుచోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది. విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో కోటి పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే బీచ్ సమీపంలోని పాండురంగాపురం వద్ద దాదాపు కోటిన్నర నగదు లభ్యమైంది. సి విజిల్ యాప్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఓ కారులో వ్యక్తులు అనుమానాస్పదం గా కనిపించగా వెంటనే వాహనం నిలిపివేశారు.

అంతలోనే నిందితులు కారు వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. కారును పరిశీలించిన అధికారులు భారీగా నగదు కనిపించడంతో షాకయ్యారు. ఆ నగదు ఒకటిన్నర కోట్ల రూపాయాలు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగదు ఎక్కడికి తరలిస్తున్నారు? ఎన్నికల వేళ ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నారా? ఈ డబ్బు ఎవరికి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News