Friday, May 10, 2024

కరిచిన పాము… 1300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

- Advertisement -
- Advertisement -

లక్నో: యువకుడికి పాము కరవడంతో 1300 కిలో మీటర్లు దూరం ప్రయాణించి ప్రాణాలు దక్కించుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం…. యుపిలో ఫతేపూర్‌కు చెందిన సునీల్ కుమార్(20) అనే యువకుడు గుజరాత్‌లోని రాజకోట్‌లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అగస్టు 15న సునీల్‌ను పాము కరవడంతో స్థానిక ఆసత్రికి రతలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వెంటనే అతడి కుటుంబ సభ్యులు కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అధునాతన అంబులెన్స్‌లో ట్రీట్‌మెంట్ చేసుకుంటూ కాన్పూర్‌కు తరలించారు. అంబులెన్స్‌ను 1300 కిలో మీటర్లకు 51 వేల రూపాయలకు కిరాయికి తీసుకున్నారు. ఎల్‌ఎల్‌ఆర్ ఆస్పత్రిలో ఐసియులో ఉంచి చికిత్స అందించారు. అగస్టు 17 రాత్రి చికిత్స ప్రారంభించామని సీనియర్ వైద్యుడు బి పి ప్రియదర్శి తెలిపారు. పాము విషం నరాలకు పాకడంతో విషానికి విరుగుడు ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు మెడిసిన్ ఇచ్చామని వైద్యులు తెలిపారు. సునీల్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు మెరుగు కావడంతో జనరల్ వార్డుకు షిప్ట్ చేశామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సునీల్ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: కబడ్డీ టోర్నమెంట్‌లో కత్తులతో బీభత్సం(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News