Sunday, May 12, 2024

అసంపూర్తి పనులు… అవస్థల్లో విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

మల్హర్: మల్హర్‌రావు మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రభుత్వపాఠశాలల అధునీకరణ పనులు అసంపూర్తిగా, నాణ్యతలోపంతో నిర్వహించడంతో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తుంది. బుధవారం కురిసిన చిన్న వర్షానికి ఇటీవల అధునీకరణ పనులు చేపట్టిన మండలంలోని కొయ్యూరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో మోకాలు లోతు నీరు నిలిచి విద్యార్థులు అవస్థలకు గురైయ్యారు.

ప్రభుత్వం సరైన విద్యనందించాలని ప్రభుత్వ పాఠశాలలు అధునీకరణ కోసం ఒక్కో పాఠశాలకు లక్షల నిధులు కేటాయించింది. ఇంజనీర్ల నిర్లక్షంతో గుత్తేదారులు పనులు మొక్కుబడిగా నిర్మించారని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దేవుడు కరుణించిన పూజారి కనికరించని చందంగా ప్రభుత్వం నిధులు ఇచ్చినా పనుల నిర్వహణలో అధికారుల నిర్లక్షం విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులు పూర్థి స్థాయిలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News