Thursday, September 18, 2025

లాడెన్‌ను మట్టుపెట్టిన నేవీ సీల్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

టెక్సాస్ : అల్‌ఖైదా నేత లాడెన్‌ను హతమార్చిన అమెరికా నౌకాదళ అధికారి రాబర్ట్ ఓ నీల్ అరెస్టు అయ్యారు. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపర్చిన కేసులో ఆయనపై కేసు నమోదు అయింది. ఫ్రిస్కోలో తొలుత కేసు నమోదు కాగా, ఇటీవలే ఆయనను టెక్సాస్‌లో అరెస్టు చేశారని న్యూయార్క్ పోస్టు తెలిపింది. గతంలో నౌకాదళంలో సీల్ విభాగంలో పనిచేసిన నీల్ అరెస్టు అయిన రోజే 3500 డాలర్ల ష్యూరిటీతో విడుదల అయ్యాడు. ఆయన మద్యం మత్తులో ఉండి ఓ వ్యక్తిపై దాడికి దిగినట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే దాడి ఘటనలోనే ఆయనను అరెస్టు చేసివదిలిపెట్టినట్లు జైలు రికార్డులు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News