Friday, May 10, 2024

కుటుంబ సమస్యలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అత్తాపూర్, మారుతి నగర్‌కు చెందిన రామచంద్ర(30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో కుటుంబంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. వాటి పట్ల విరక్తి చెందని రామచంద్ర ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News