Thursday, May 16, 2024

నగరంలో దంచికొట్టిన వాన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో వర్షం దంచికొట్టింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయమంతా ఎండగా ఉన్నవాతావరణం సాయంత్రం గంటల ప్రాంతంలో పూర్తిగా చల్లబడమే కాకుండా భారీ వర్షం కురిసింది. దీంతో సాయంత్రం వేళా భారీ వర్షం కురువడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గంటల వ్యవధిలోని 4సె.మి. మేర వర్షం కురువడంతో లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి ట్రాపిక్ జామ్ ఏర్పడింది.

దీంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుబడి పోయ్యారు. సికింద్రాబాద్‌లో అర్థగంట వ్యవధిలోని 4.7సె.మి.వర్షం కురువడంతో ఈ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్‌లో 4.2, ఖైరతాబాద్ 4.1 గోషమహాల్ 4.03 సెమి. చార్మినార్ .3.9 సెమి. వర్షం కురిసింది. అదేవిధంగా సరూర్ నగర్, అంబర్‌పేట్, మలక్‌పేట్, బంజారాహిల్స్, నాంపల్లి, అల్కాపురి, విజయనగర్ కాలనీ, నాగోల్ , బండ్లగూడ ఎల్‌బి స్టేడియం హిమాయత్ నగర్, రాక్ టౌన్ కాలనీ ప్రాంతాలో 3 నుంచి 3.9 సె.మి.వర్షం కురిసింది.

అదేవిధంగా కార్వాన్, ఉప్పల్, గౌతమ్‌నగర్, సంతోష్ నగర్, లంగర్‌హౌజ్, షేక్‌పేట్, ఎల్‌బినగర్, శ్రీనగర్ కాలనీ, గుడిమల్కాపూర్, ఆసీఫ్‌నగర్, ఖాజాగూడ, శేరిలింగంపల్లి, లింగోజిగూడ, దూద్‌బౌలి, కుర్మగూడ, రాయదుర్గ్ ,గచ్చిబౌలి, మెహిదిపట్నం, రాజేంద్రనగర్, కందికల్ గేట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ, ఎంసిహెచ్‌ఆర్‌డి , ఉస్మానియా విశ్వవిద్యాలయం, వెంగల్ రావు నగర్, యూసుప్‌గూడ, కిషన్ బాగ్, ఫలక్‌నుమా, చందానగర్, మాదాపూర్, గోల్కొండ, తదితర ప్రాంతాల్లో సైతం భారీ వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News