Saturday, June 8, 2024

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో డాబర్ చైర్మన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు డాబర్ గ్రూప్ చైర్మన్ మోహిత్ బర్మన్, డైరెక్టర్ గౌరవ్ బర్మన్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిని కంపెనీ ఖండిస్తూ, ఇది దుర్మార్గమైన చర్యగా పేర్కొంది.
ఎఫ్‌ఐఆర్‌లో గౌరవ్ బర్మన్, మోహిత్ బర్మన్ సహా 32 మంది పేర్లను నమోదు చేశారు. డాబర్ కంపెనీ ఎఫ్‌ఐఆర్ గురించి తెలియదని కొట్టిపారేస్తున్నప్పటికీ, వార్తా సంస్థ ఎఎన్‌ఐ దాని వివరాలను వెల్లడించింది. ఈ కేసులో మోసం, జూదం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News