Wednesday, May 15, 2024

గార ఎస్‌బిఐ బ్రాంచిలో బంగారు రుణాల సంచులు మాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా గార స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) బ్రాంచ్‌లో60 బంగారు రుణాల సంచులు మాయమైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై లోతైన విచారణ కొనసాగుతోందని, ఈ విషయాన్ని కస్టమర్లకు ఇప్పటికే తెలియజేయడం జరిగిందని విశాఖపట్నం ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వినియోగదారుల ప్రయోజనాలను బ్యాంక్ కాపాడుతుందని, ఏ వినియోగదారుడికీ ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూస్తుందని కూడా ఆయన తెలిపారు. కనిపించకుండా పోయిన 86 సంచుల్లో 26 సంచులను ఇప్పటకే రికవరీ చేశామని, అందులోని వస్తువులను పరిశీలించడం కూడా జరిగిందని,

మిగతా బ్యాగుల రికవరీ ప్రక్రియ కొనసాగుతోందని కుమార్ తెలిపారు. ఈ 60బ్యాగులు తప్ప గార బ్యాంకు శాఖలో తనఖా పెట్టిన ఇతర బంగారు నగల బ్యాగులన్నీ భద్రంగా ఉన్నాయని, తమ రుణాలను తిరిగి చెల్లించే కస్టమర్లందరికీ వారి వస్తువులను తిరిగి ఇవ్వడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పంకజ్ కుమార్ తెలియజేశారు. గతంలో మాదిరిగానే తమ బ్యాంకుపై విశ్వాసాన్ని కొనసాగిస్తున్న కస్టమర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బ్యాంకు సిబ్బంది వారి అవసరాలనుతీర్చడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన తెలిపారు. కస్టమర్ల పట్ల ఎస్‌బిఐ అంకితభావంతో పని చేస్తుందని, ఎవరికీ ఏ విధంగాను నష్ట కలగకుండా చూస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News